కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ శివారులో మంగళవారం 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 26 మందిలో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వేగంగా వెళ్తున్న బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ వైపు బస్సు ముందు భాగం ధ్వంసమైంది. గాయపడిన వారిని కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.