TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న నిడదవోలు ఆర్టీసీ బస్సు రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.