ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

15612చూసినవారు
ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
TG: వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తున్న బస్సు 44వ నంబర్ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది వరకు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. బస్సు బోల్తా కొట్టి రోడ్డుకు అడ్డంగా పడటంతో రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం వేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్