ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

10176చూసినవారు
ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు
AP: అనమయ్య జిల్లాలో టైరు పంక్చరై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వాల్మీకిపురం మండలం విఠలం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మదనపల్లె ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం తిరుపతికి బయల్దేరగా.. విఠలం వద్ద టైరు పంక్చర్ కావడంతో పక్కనే ఉన్న కల్వర్టులోకి వెళ్లి బస్సు బోల్తా పడింది. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్