రోడ్డుపై బురదలో కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు (వీడియో)

8చూసినవారు
TG: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ సమీపంలో రోడ్డుపై బురదలో ఆర్టీసీ బస్సు కూరుకుపోయింది. గ్రామ సమీపంలో గత కొన్ని రోజుల క్రితం బ్రిడ్జి నిర్మాణం పనులు జరగడంతో కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ దారి చేశారు. ఆ దారిలో కొంత మేరకు మట్టి పోపించారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా బురద మయంగా కావడంతో ఆర్టీసీ బస్సు అందులో కూరుకుపోయింది. ఈ ఘటనతో విద్యార్థులు, ప్రయాణికులు గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామస్తులు జేసీబీ సహాయంతో బస్సును బయటకు తీశారు.
Job Suitcase

Jobs near you