పల్లె పల్లెకు ఆర్టీసీ బస్సులు: మంత్రి పొన్నం

32చూసినవారు
పల్లె పల్లెకు ఆర్టీసీ బస్సులు: మంత్రి పొన్నం
TG: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల స్వయం ఉపాధి కోసం ప్రతి నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు ఉచితంగా అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉప్పునుంతల మండలంలోని హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి డిండి కట్ట మైసమ్మ ఆలయం నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్