
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. 8.25% వడ్డీకి కేంద్రం ఆమోదం
EPFOలోని దాదాపు 8 కోట్ల మంది సభ్యులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి PF డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఈ వడ్డీ చెల్లింపులను వీలైనంత త్వరగా ఖాతాదారుల ఖాతాలకు జమ చేయాలని EPFO తన ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. ఇటీవల జరిగిన డేటాబేస్ బలోపేతం, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కారణంగా ఈసారి వడ్డీ బదిలీ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుందని భావిస్తున్నారు. ఇది వరుసగా మూడవ సంవత్సరం ప్రభుత్వం 8.25% వడ్డీ రేటును కొనసాగించడం.




