ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామ సమీపంలో మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. మధిర బస్టాండ్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న బస్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో సీట్ల కోసం పోటీ నెలకొంది. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తికి సీటు ఇవ్వలేదనే కారణంతో వివాదం మొదలై, ఘర్షణకు దారితీసింది. సిబ్బంది జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ గొడవ కారణంగా బస్సు ప్రయాణానికి కాసేపు అంతరాయం కలిగింది.