
యువకుడిపై కత్తితో దాడిచేసిన దుండగులు
TG: హైదరాబాద్లోని పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అరవింద్ అనే యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడిచేశారు. ఈ దాడిలో అరవింద్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.




