జార్ఖండ్‌లో రుబెల్లా వైరస్ కలకలం.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ

2001చూసినవారు
జార్ఖండ్‌లో రుబెల్లా వైరస్ కలకలం.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ
జార్ఖండ్‌లోని సిమ్డేగా జిల్లాలో 10 ఏళ్ల బాలికలో రుబెల్లా వైరస్ గుర్తించడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. సెప్టెంబర్ 22న తొలి కేసు వెలుగులోకి రాగానే, ఆరోగ్యశాఖ మీజిల్స్-రుబెల్లా (MR) టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. రుబెల్లా అంటువ్యాధి పిల్లలు, పెద్దల్లో తేలికపాటి ఇన్ఫెక్షన్‌గా ఉన్నా, గర్భిణులకు తీవ్ర ప్రమాదకరం. గర్భధారణ తొలి 12 వారాల్లో సోకితే శిశువుల్లో కాంజెనిటల్ రుబెల్లా సిండ్రోమ్ (CRS) ప్రమాదం పెరుగుతుంది. నివారణకు టీకానే కీలకం అని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్