పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ-సిగరెట్ వివాదం కలకలం రేపుతోంది. లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, తృణమూల్ కాంగ్రెస్ మహిళా సభ్యులు సభలో ఈ-సిగరెట్లు తాగుతున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా నిషేధించినా చట్టసభలో ఇలాంటి పనులు ఏంటని ప్రశ్నించారు. స్పీకర్ ఓం బిర్లా, సభలోకి ఈ-సిగరెట్లకు అనుమతి లేదని, ధూమపానం నేరమని, రాతపూర్వకంగా ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సభలో ఎవరైనా సిగరెట్ తాగుతున్నట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.