AP: నంద్యాల జిల్లా గాజులపల్లె గ్రామ సమీపంలోని వాగులో వజ్రాలు దొరుకుతున్నాయన్న పుకారుతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేలాది మంది ప్రజలు వాగుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వజ్రాల కోసం వెతికారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో చిరు దుకాణాలు వెలిశాయి. కొంతమంది వ్యాపారులు కావాలనే ఇలా పుకార్లు పుట్టించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.