
సర్పంచ్ అభ్యర్థిపై కారంపొడితో దాడి: దుండగుల కోసం గాలింపు
కరీంనగర్ జిల్లా మొలంగూర్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కొమురయ్య కళ్లల్లో కారంపొడి చల్లి దుండగులు దాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.




