
ఏఐ ఆధారిత సేవలు ప్రవేశ పెట్టిన యాక్సిస్ బ్యాంక్
ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తమ కరెంట్ అకౌంట్హోల్డర్ల కోసం రెండు కొత్త ఏఐ ఆధారిత సేవలను ప్రవేశపెట్టింది. ఏఐ ఆధారిత రీకేవైసీ, ఏఐ ఆధారిత డిజిటల్ బిజినెస్ ప్రొఫైల్ అప్డేట్ సర్వీసెస్ వీటిలో ఉన్నాయి. వ్యక్తిగతేతర కరెంట్ అకౌంట్ కస్టమర్ల కోసం కేవైసీ వివరాలను అప్డేట్ చేయడానికి రీకేవైసీ సహాయపడుతుంది. అలాగే, డిజిటల్, పేపర్రహిత ప్రక్రియ ద్వారా వ్యాపార స్వరూపంలాంటి వివరాలను అప్డేట్ చేయడానికి ప్రొఫైల్ అప్డేట్ సర్వీస్ ఉపయోగపడుతుంది.




