
టీసీని చూసి రైలు పైకప్పు ఎక్కి హల్ చల్ చేసిన వ్యక్తి
ధర్మవరం-నరసాపురం రైలులో టికెట్ లేని వ్యక్తి హైడ్రామా చేశాడు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, ఉదయం 3 గంటలకు గుడివాడ స్టేషన్ చేరుకున్న సమయంలో, టికెట్ కలెక్టర్ (టీసీ)ని చూసి రైలు పైకప్పుపైకి ఎక్కి కలకలం సృష్టించాడు. రైల్వే పోలీసులు అతి కష్టం మీద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించబడ్డాడు. రైల్వే పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.




