ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 800కు పైగా డ్రోన్లు, క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. రష్యా తొలిసారిగా ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. అయితే 747 డ్రోన్లు, నాలుగు క్షిపణులను నేలకూల్చినట్లు ఉక్రెయిన్ ప్రతినిధి యూరీ ఇన్హాత్ పేర్కొన్నారు. 54 డ్రోన్లు, తొమ్మిది క్షిపణులు 37 ప్రాంతాలను తాకగా.. ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందినట్లు తెలిపారు.