ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో రైల్వే స్టేషన్, ప్రయాణికుల రైలు లక్ష్యంగా రష్యా దళాలు డ్రోన్ దాడులు జరిపాయి. బాంబులు పడటంతో రైలు బోగీలు మంటల్లో కాలి పోయాయి. 30 మందికి పైగా గాయపడగా, మరికొందరు చిక్కుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రష్యాపై అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.