ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఐదుగురు మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. కీవ్‌లోని బ్రోవరీ జిల్లాలో మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ భాగస్వామికి చెందిన గోదాముపై రెండుసార్లు డ్రోన్ దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రెండో దాడి తర్వాత గోదాములో భారీగా మంటలు చెలరేగాయి. ఆహార ఉత్పత్తుల నిల్వ విభాగం పూర్తిగా దగ్ధమైనట్లు వెల్లడించారు. పౌర మౌలిక వసతులు, వ్యాపార సంస్థలను రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.