బిలియనీర్‌ లక్ష్మీ మిత్తల్‌ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి దాడి

8362చూసినవారు
భారత సంతతికి చెందిన లక్ష్మీ మిత్తల్ స్టీల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వస్థలమైన క్రైవీ రిహ్‌లోని ఈ ప్లాంట్‌పై ఆదివారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. ప్లాంట్‌లోని విద్యుత్ సరఫరా, బ్లాస్ట్ ఫర్నేస్ విభాగాలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపివేశారు. నష్టాన్ని అంచనా వేసి, ఉత్పత్తిని పునరుద్ధరించడంపై కంపెనీ నిర్ణయం తీసుకోనుంది. ఈ దాడికి ముందు ఉక్రెయిన్ రష్యాపై 822 డ్రోన్లతో దాడి చేసింది.

సంబంధిత పోస్ట్