రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు

38చూసినవారు
రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు
టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా-ఏతో జరిగిన రెండో వన్డేలో అజేయ అర్ధశతకం (68 నాటౌట్) సాధించడంతో అతని సగటు 57.80కి చేరింది. ఈ క్రమంలో చతేశ్వర్ పుజారా (57.01)ను అధిగమించాడు. ప్రపంచ క్రికెట్‌లో మైఖేల్ బెవాన్ (57.86) మాత్రమే అతని కంటే ముందున్నాడు. గైక్వాడ్ 85 లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌లలో 17 శతకాలు, 18 అర్ధశతకాలతో 4509 పరుగులు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్