దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో ఉన్న కోహ్లీ (49) కూడా అర్ధశతకానికి చేరువలో ఉన్నారు. 24 ఓవర్లు ముగిసే సమయానికి టీమ్‌ఇండియా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 154 పరుగులుగా ఉంది. మంచి స్కోర్ కోసం గైక్వాడ్, కోహ్లీ నిలకడగా ఆడుతున్నారు.