TG: కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు 'రైతు భరోసా' (ఎకరానికి రూ.6,000)పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 5వ తేదీ వరకు అర్హులైన రైతులు రైతు వేదికల్లో ఏఈవోలకు దరఖాస్తులు సమర్పించాలి. రైతులు తమ దరఖాస్తు ఫారంతో పాటు గుర్తింపు కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ ప్రతులను జతచేయాలని వ్యవసాయాధికారులు సూచించారు. ఈ గడువు లోపు దరఖాస్తు చేసుకున్నవారికే రైతు భరోసా అందుతుందని అధికారులు చెబుతన్నారు.