తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రైతు డిస్కం సేవలు జూన్ 2 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. గత ఐదేళ్ల విద్యుత్ వినియోగం ఆధారంగా డిస్కంల వాటాలను నిర్ణయించారు. దీని ప్రకారం, SPDCL వాటా 71% నుంచి 45%కి, NPDCL వాటా 29% నుంచి 13%కి తగ్గింది. రైతు డిస్కం వాటా 42%గా ఖరారైంది. ఈ మార్పుల నేపథ్యంలో, ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేలోగా ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. రైతు డిస్కంకు సౌత్ డిస్కం నుంచి 15.27 లక్షల, నార్త్ డిస్కం నుంచి 13.80 లక్షల కనెక్షన్లను బదిలీ చేశారు.