
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి.. తెరపైకి విక్రమ్ గౌడ్..? (VIDEO)
TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్ బైపోల్లో ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి అధికారికంగా ఖరారు కాలేదు. అయితే, పార్టీ వర్గాల్లో విక్రమ్ గౌడ్ పేరుపై చర్చ జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ ఏ రాజకీయ పార్టీకీ చెందిన వారు కాకపోవడంతో ఆయన బీజేపీ తరఫున బరిలో దిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.




