శబరిమల ఆదాయం రూ.92 కోట్లు.. భక్తుల తాకిడితో రికార్డు వసూళ్లు

78చూసినవారు
శబరిమల ఆదాయం రూ.92 కోట్లు.. భక్తుల తాకిడితో రికార్డు వసూళ్లు
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో మండల-మకరవిలక్కు సీజన్ తొలి 15 రోజుల్లో రూ.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.69 కోట్లు రాగా, ఈసారి 33.33 శాతం వృద్ధి నమోదైంది. అయ్యప్ప ప్రసాదం అమ్మకాల ద్వారా రూ.47 కోట్లు, హుండీ ఆదాయంలో 18.18 శాతం పెరుగుదల కనిపించింది. గత ఏడాది నవంబరు 30 నాటికి 13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్