విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సంస్కారంతో అందరినీ ఆకట్టుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా ఇస్తుండగా, సచిన్ వెంటనే తన షూలను విప్పి, అత్యంత భక్తితో విగ్రహాన్ని అందుకున్నారు. దైవం పట్ల ఆయన ప్రదర్శించిన ఈ గౌరవాన్ని
విద్యార్థులు, ప్రముఖులు ప్రశంసిస్తూ, సచిన్ క్రమశిక్షణ, వినయానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడుతున్నారు.