జస్ట్ రూ.32 లక్షలకే ఫ్లాట్‌ను కొన్న సచిన్‌ టెండూల్కర్‌ భార్య

13497చూసినవారు
జస్ట్ రూ.32 లక్షలకే ఫ్లాట్‌ను కొన్న సచిన్‌ టెండూల్కర్‌ భార్య
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలి టెండూల్కర్ ముంబై సమీపంలోని విరార్‌లో కొత్త ఫ్లాట్ కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ ఫ్లాట్ విస్తీర్ణం 391 చదరపు అడుగులు మాత్రమే. పెనిన్సులా హైట్స్‌లో ఉన్న ఈ ఫ్లాట్ ధర రూ.32 లక్షలు. ఈ ఏడాది మే 30న రిజిస్టర్ చేసుకున్న అంజలి రూ.1.92 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. మహారాష్ట్రలో మహిళలకు లభించే 1% స్టాంప్ డ్యూటీ రాయితీని కూడా ఆమె పొందారు.