తొమ్మిది నెలల వయసులో తల్లిదండ్రులతో కలిసి భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన వేదం సుబ్రహ్మణ్యం, తన చిన్ననాటి స్నేహితుడు థామస్ కిన్సర్ హత్య కేసులో జీవితఖైదు శిక్ష అనుభవించాడు. 1961లో జన్మించిన వేదం కుటుంబం 1962లో అమెరికా వెళ్లింది. 1980లో థామస్ అదృశ్యమై, తొమ్మిది నెలల తర్వాత శవమై కనిపించాడు. చివరిసారిగా థామస్‌తో వేదం ఉన్నాడనే ఆరోపణలపై 1982లో అరెస్టు చేయబడ్డారు. 1983లో సరైన సాక్ష్యాలు లేకపోయినా కోర్టు ఆయనకు శిక్ష విధించింది. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.