TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెల రోజుల్లో సేఫ్టీ ఆడిట్లు నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫైర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్లు, ఏడాదికి ఒకసారి స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్లు తప్పనిసరిగా చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించడానికి ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్లు, మాక్ డ్రిల్స్ నిర్వహించాలని, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. ఫైర్, ఎలక్ట్రికల్ పరికరాల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కూడా ఆదేశించారు.