
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్.. ఎక్కడ జరుగుతుందో తెలుసా?
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ మేనన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ హోం గ్రౌండ్లో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఒక ప్లే ఆఫ్ మ్యాచ్‌తో పాటు, ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది. తేదీలను బీసీసీఐ త్వరలో విడుదల చేయనుంది.




