ఉత్తరాదిలో నాసిరకం పనుల కారణంగా పలు నిర్మాణాలు కూలిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను కలిపే మీరుట్-కోట్‌ద్వార్ నేషనల్ హైవే నిర్మాణం పూర్తి కాకముందే, చిన్న వర్షానికే ఒక వైపు సేఫ్టీ వాల్ కుప్పకూలింది. నాసిరకం పనులపై కాంట్రాక్టర్లు, అధికారులపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.