
పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలి: కాజోల్ బోల్డ్ కామెంట్స్
బాలీవుడ్ నటి కాజోల్ తన తాజా వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చ రేకెత్తించారు. ఆమె నిర్వహించే 'Too Much with Kajol and Twinkle' టాక్ షోలో మాట్లాడుతూ.. పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలని అన్నారు. సరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటామని ఎవరూ హామీ ఇవ్వలేరని, పెళ్లికి గడువు ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదని, రెన్యువల్ ఆప్షన్ ఉంటే బంధానికి కొత్త అర్థం వస్తుందని ఆమె వివరించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.




