సాగర్‌ ఫీల్డ్‌ విజిట్‌కు 100 మంది ఏఈఈలు

2452చూసినవారు
సాగర్‌ ఫీల్డ్‌ విజిట్‌కు 100 మంది ఏఈఈలు
TG: శిక్షణలో ఉన్న 100 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల (ఏఈఈ) నాగార్జునసాగర్‌ డ్యామ్‌ ఫీల్డ్‌ విజిట్‌కు కృష్ణా బోర్డు అనుమతిచ్చింది. 2024లో నియమితులైన బ్యాచ్‌-1, బ్యాచ్‌-2 ఏఈఈలు ఈ నెల 26న సాగర్‌ ప్రాజెక్టుతో పాటు కెనాల్‌ నెట్‌వర్క్‌ను పరిశీలించనున్నారు. వీరితో పాటు 10 మంది శిక్షణ సిబ్బంది కూడా వెళ్లనున్నారు. డ్యామ్‌ వద్ద భద్రతా కారణాలతో సీఆర్పీఎఫ్‌ గస్తీ కొనసాగుతున్న నేపథ్యంలో.. ముందస్తు అనుమతి కోసం కృష్ణా బోర్డు సీఆర్పీఎఫ్‌కు లేఖ రాసింది. అధికారులు, సిబ్బంది భద్రతకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్