కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు: రేవంత్ రెడ్డి

5740చూసినవారు
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు: రేవంత్ రెడ్డి
TG: రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీరికి కూడా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు ఆర్థిక శాఖ ఈ నెల నుంచే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయంతో ఉపశమనం కలిగింది. జులై 1వ తేదీనే వారి అకౌంట్లలో జీతాలు జమ చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్