అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు.. ప్రభుత్వం కసరత్తు!

5చూసినవారు
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు.. ప్రభుత్వం కసరత్తు!
TG: రాష్ట్ర ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా జీతాలు అందనున్నాయి. ఈ మేరకు అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీలకు వారం రోజుల ముందే బిల్లులు చెల్లించాలని  ఆదేశించినట్లు సమాచారం. గతంలో సీఎం రేవంత్ ఈ మేరకు ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విధానం వల్ల దాదాపు 5 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్