తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ చేస్తామని హామీ ఇవ్వడంతో వారి జీతాలు పెరిగే అవకాశాలున్నాయి. కండక్టర్లు, డ్రైవర్లకు రూ.4వేల నుంచి రూ.10వేలకు పైగా జీతాలు పెరగనున్నాయని సమాచారం. ఈ నిర్ణయంతో సంస్థలోని 38వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారితో పాటు, 2021 ఏప్రిల్ నుంచి పదవీ విరమణ చేసిన వారికి కూడా ఈ ప్రయోజనం వర్తించనుంది. అయితే, ఈ వేతనాల పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.1000కోట్లకు పైగా అదనపు భారం పడే అవకాశం ఉంది.