భారత్‌లో అత్యవసర గర్భనిరోధక మాత్రల (ఈసీపీ) అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఏటా 3.5 కోట్ల యూనిట్లు అమ్ముడవుతున్నట్లు మోర్డర్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ నివేదికలో వెల్లడించింది. అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందని, 2019–2025 కాలంలో దీని వృద్ధి 12%గా నమోదైందని తెలిపింది. ఈపీసీ వినియోగం పెరగటంతో కండోమ్ విక్రయాలు తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. సులభంగా లభ్యమవ్వడం కారణంగా టీనేజర్లు కూడా వీటిని వినియోగిస్తున్నారని చెప్పింది.