దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీం డోలాను భారత్‌కు తీసుకువచ్చారు. తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో డోలాను అరెస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే ప్రత్యేక విమానంలో అధికారుల పర్యవేక్షణలో దిల్లీకి తీసుకొచ్చారు. మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కేసుల్లో డోలాపై విచారణ కొనసాగించేందుకు అతడిని త్వరలోనే ముంబయి పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ పరిణామం అంతర్జాతీయ నేర ముఠాలపై దర్యాప్తుకు కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.