రియాద్ లో జరిగిన "జాయ్ ఫోరమ్ 2025" కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. సౌదీలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాలకు మంచి ఆదరణ ఉందని అక్కడ నివసిస్తున్న వివిధ దేశాలే కారణమని ముఖ్యంగా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బలోచిస్థాన్ దేశ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ లోని బలోచిస్థాన్ ను వేరుగా ప్రస్తావించడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.