ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


గ్రూప్స్ నోటిఫికేషన్ రావడం లేదని యువకుడి ఆత్మహత్యాయత్నం
Aug 01, 2026, 15:08 IST/

గ్రూప్స్ నోటిఫికేషన్ రావడం లేదని యువకుడి ఆత్మహత్యాయత్నం

Aug 01, 2026, 15:08 IST
TG: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన నిరుద్యోగి గడ్డం వేణు కుమార్, గ్రూప్స్ నోటిఫికేషన్లు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత 5 ఏళ్లుగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నానని, సరైన సమయంలో నోటిఫికేషన్లు రాకపోవడంతో సమయం, వయస్సు వృథా అవుతున్నాయని, ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని సూసైడ్ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ లేఖను సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాహుల్ గాంధీల దృష్టికి తీసుకెళ్లాలని నిరుద్యోగులను కోరాడు. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో అతడి పరిస్థితి విషమంగా ఉంది.