
మంత్రి పర్యటనలో ASI మృతి
కర్ణాటకలోని బళ్లారిలో విషాద ఘటన జరిగింది. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పర్యటన సమయంలో APMC స్టేషన్కు చెందిన ASI శ్రీనివాసరావు బందోబస్తు విధుల్లో ఉన్నారు. కొత్త DC కార్యాలయం ముందు జరిగిన మంత్రి ప్రజా దర్శన సమయంలో ASI శ్రీనివాసరావు (54) కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సహచరులు VIMS ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన 'లో బీపీ' కారణంగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.




