జాయ్ ఫోరం 2025 కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాకిస్తాన్ ప్రభుత్వం సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాద నిరోధక చట్టం కింద నాల్గవ షెడ్యూల్‌లో చేర్చి అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు ప్రధాన దేశాలు కూడా చేయడానికి వెనుకాడే పనిని బాలీవుడ్ హీరో చేశాడని అభినందించారు.