టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి రిలేషన్‌పై మరోసారి చర్చ మొదలైంది. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడం, 'శుభం' సక్సెస్ సెలబ్రేషన్‌లో పాల్గొనడం, ఒకే కారులో కనిపించడం వంటివి వారి మధ్య బలమైన బంధం ఏర్పడిందనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.