
రియల్ లైఫ్లో '3 ఇడియట్స్' సినిమా ఘటన (వీడియో)
ముంబైలోని రామ్మందిర్ స్టేషన్లో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో, యువకుడు వికాస్ రైలును ఆపి, వీడియో కాల్ ద్వారా వైద్యురాలి సూచనలతో సురక్షితంగా ప్రసవం జరిగేలా సహాయం చేశాడు. స్టేషన్లోని ప్రయాణికులు, సిబ్బంది సహకారంతో తల్లి, బిడ్డ క్షేమంగా ఆసుపత్రికి తరలించబడ్డారు. ఈ ఘటన 'త్రీ-ఇడియట్స్' సినిమాను తలపించింది. వికాస్ ధైర్యసాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.




