సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా వాయిదా పడింది. మొదట చిత్ర యూనిట్ విడుదల తేదీని మే 15గా ప్రకటించగా.. దానిని జూన్ 19కి వాయిదా వేసింది. ఈ సినిమా విడుదల వాయిదా పడటం పట్ల అభిమానులు నిరాశ చెందుతున్నారు. కొత్త విడుదల తేదీతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సమంత మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.