
కెనడా ప్రకటనపై ట్రంప్ ఆగ్రహం.. 10% అదనపు సుంకం
కెనడా రూపొందించిన వాణిజ్య ప్రకటనపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాడ్‌లో 1987లో రోనాల్డ్ రీగన్ ప్రసంగం జోడించబడి, విదేశీ వస్తులపై అధిక టారీఫ్‌లు ప్రభావం చూపుతాయని చూపించడమే ట్రంప్ అసహనానికి కారణమైంది. ఈ మేరకు ట్రంప్ ఇప్పటికే ఉన్న సుంకాలకు 10% అదనంగా టారిఫ్‌లు విధించారు. చర్చలను నిలిపివేస్తున్నట్టు కూడా ప్రకటించారు. కెనడా ప్రభుత్వం యాడ్‌ను తొలగిస్తే వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయని తెలిపారు.




