సమంత రెండో పెళ్లి.. మేకప్ స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్

66చూసినవారు
సమంత రెండో పెళ్లి.. మేకప్ స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్
నటి సమంత సోమవారం రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె వ్యక్తిగత మేకప్‌ స్టైలిస్ట్‌గా పనిచేసిన సాధనా సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ‘విక్టిమ్‌గా విలన్‌ బాగా నటించారు" అని ఆమె చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. ఇది సమంతను ఉద్దేశించి రాశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇద్దరూ అత్యంత సన్నిహితంగా ఉండగా, ఇప్పుడు ఏమైందన్నదానిపై నెట్టింట చర్చ నడుస్తోంది. కాగా నటి పూనమ్ కౌర్ కూడా  'సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం" అని చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్