
ఫిలిప్పీన్స్లో మరోసారి భూకంపం
ఫిలిప్పీన్స్లోని మిండానావో ప్రాంతంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వారం క్రితమే 7.5 తీవ్రతతో రాగ మళ్లీ ఇప్పుడు భూకంపం సంభవించింది. ఇది 62 కిలోమీటర్ల లోతులో సంభవించిందని యూరోపియన్ -మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. పాఠశాలు, భవనాలు, ఒక ఆసుపత్రి పూర్తిగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.




