హైదరాబాద్‌లోని పాతబస్తీలోని ఎర్రకుంట ప్రాంతంలో హోటళ్ల వద్ద చెప్పుల దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. భోజనానికి వచ్చిన కస్టమర్లు బయటకు వచ్చేసరికి వారి చెప్పులు మాయమవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీల పరిశీలించగా.. ఒక వ్యక్తి కస్టమర్‌లా నటించి, ఆర్డర్ చేసి, ఆ చెప్పులు వేసుకుని వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. అతను రాత్రిపూట హోటళ్ల వద్ద, సమీప కాలనీల్లో ఖరీదైన చెప్పులు, సాండల్స్ దొంగిలించి, తన సైజువి వాడుకుని, మిగిలినవి అమ్ముకుంటున్నట్లు విచారణలో తేలింది.