
'3 ఇడియట్స్' సీక్వెల్ వచ్చేస్తుంది
రాజ్‌కుమార్ హిరానీ, అమీర్ ఖాన్ కాంబోలో వచ్చిన '3 ఇడియట్స్' చిత్రానికి సీక్వెల్ రాబోతోందని వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ ఫైనల్ అయిందని, టీం చాలా ఉత్సాహంగా ఉందని సమాచారం. సుమారు 15 ఏళ్ల తర్వాత పాత్రలు మళ్లీ కలిసి కొత్త అడ్వెంచర్‌ను ప్రారంభిస్తాయని తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్‌తో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పుడు '3 ఇడియట్స్' సీక్వెల్‌పై దృష్టి సారించినట్లు బీటౌన్ వర్గాల సమాచారం.




